Friday, July 27, 2012

అమృతం

మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు 

Tuesday, December 18, 2007

మధుర జ్ఞాపకాలు

అవి నేను టెన్త్ చదివే రోజులు(చదువంటే రోజు స్కూల్ కి వెళ్లి రావటం).స్కూల్ మొదటి రోజు,అయ్యవర్లంత ఒకటే క్లాసులు టెన్త్ క్లాస్ యొక్క ప్రాధాన్యం గురించి.మా హెడ్మాస్టారు "మీ జీవితంలో టెన్త్ క్లాస్ ఒక మలుపు లాంటిది.టెన్త్ లో మంచి మార్కులు వస్తె మీకు మంచి మంచి గోవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి(అప్పట్లో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఒక్కటే).మీకు టెన్త్ లో సరిగా మార్కులు రాకపోతే జీవితంలో దేనికి పనికిరారు.ఇక నుండి ఆటలు కట్టి పెట్టి సదవల మింద ధ్యాస పెట్టండి.బాగా చదువుకొని మీ అమ్మ నాయనలకు మంచి పేరు త్యవాలి."ఇలా ఒక గంట క్లాసు పీకారు.ఆరోజు క్లాసుకు ప్రతి అయ్యవారు రావడం టెన్త్ లో అల చదవాలి ఇలా చదవాలి లేదంటే అంటే సంగతులు.దీంతో టెన్త్ సదువు మీద ధ్యాస కంటే భయం పెరిగింది.